సినిమా హిట్ అయితే మరో పార్ట్ తీయొచ్చు.. లేదంటే అక్కడితో ఆపెయొచ్చు.. ఇదే ఉద్దేశ్యంతో చాలా సినిమాల క్లైమాక్స్‌లో.. సీక్వెల్ కోసం లీడ్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయినా మంచు విష్ణు జిన్నా మూవీ కూడా ఇదే ఫార్మాట్‌ను ఫాలో అయింది. మోసగాళ్ళు సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు.. తాజాగా జిన్నాగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు.
ఈశాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన జిన్నా.. థియేటర్లో బాగానే ఎంటర్టైనింగ్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. దాంతో జిన్నా సీక్వెల్ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండే ఛాన్స్ ఉందని ప్రమోషన్‌లోభాగంగా చెప్పుకొచ్చాడు విష్ణు. దాంతో సినిమా క్లైమాక్స్‌లో జిన్నా2 కథకు లీడ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్ట్ 2(ginna2) లోడింగ్ అని ఎండ్ కార్డ్‌లో వేయడంతో జిన్నా2పై క్లారిటీ ఇచ్చినట్టేనని అంటున్నారు.
అయితే ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.. అది తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే జిన్నా తర్వాత మరో సినిమాకు కమిట్ అవలేదు విష్ణు. కానీ శ్రీను వైట్లతో ఢీ సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. కాబట్టి ముందు జిన్నా సీక్వెల్‌ని పట్టాలెక్కిస్తాడా.. లేక ఇప్పటికే ప్రకటించిన ఢీ సీక్వెల్‌ని సెట్స్ పైకి తీసుకెళ్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. లేక ఈ రెండు కాకుండా మరో కొత్త ప్రాజెక్ట్ చేస్తాడా అనేది.. త్వరలోనే క్లారిటీ రానుంది.