Malvika: మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ రజినీకాంత్ పేట మూవీతో అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ మాస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఆ తర్వాత తెలుగులో కూడా ఆఫర్లు వచ్చాయి. ఈ బ్యూటీ ఎలాంటి దుస్తుల్లో అయినా, చూపరులను మెస్మరైజ్ చేయడంలో ముందుంటుంది.
తెలుపు రంగు చీరలో కనిపించింది. చీరలో ఃనడుము, నాభి అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అది కూడా నీటిలో తడుస్తూ ఆ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ఈ హాట్ ఫోటోషూట్‌కి కుర్రాళ్ల గుండెలు గుభేలుమంటున్నాయి. ఈ స్టన్నింగ్స్ లుక్స్ ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటీ సినీ బ్యాగ్రౌండ్ నుంచే ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమాటోగ్రాఫర్ కె యూ మోహనన్ కూతురే ఈ మాళవిక. తండ్రి సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో, ఆమెకు సినిమాల్లోకి అడుగుపెట్టడం సులువైంది.
2013లో కెరీర్ ని మొదలుపెట్టినా, పేట మూవీతోనే అందరూ ఆమెను గుర్తించారు. అంతకుముందు మళయాళంతో పాటు, కన్నడలోనూ పలు సినిమాలు చేసింది. ఇప్పడు తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో మొదటి మూవీనే ఏకంగా ప్రభాస్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ గా మాళవికను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ క్లిక్ అయితే, మాళవికు తెలుగులో ఇక తిరుగులేనట్లే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.నాభి అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తున్న మాళవిక.