స్టార్ హీరో సినిమాల గురించి పుకార్లు రావడం కొత్తేం కాదు. కాకపోతే అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో.. మళ్లీ రీషూట్ అనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే జరిగితే మహేష్ బాబు వల్ల మేకర్స్‌కు కోట్ల నష్టం జరిగినట్టేనని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు రీసెంట్‌గానే సెట్స్ పైకి వెళ్లింది. అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ షెడ్యూల్ మొదలై.. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీకి చిత్ర యూనిట్ షిప్ట్ అయిందని వార్తలొచ్చాయి.
అలాగే ఈ షెడ్యూల్ 20 రోజులకు పైగానే జరుగుతుందని వినిపించింది. కానీ అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందని ప్రకటించారు మేకర్స్. అలాగే దసరా తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఫిల్మ్ నగర్లో మరో వెర్షన్ వినిపిస్తోంది. ఐదారు రోజుల్లోనే షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వడంతో.. పలు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబుకి ఫైట్ మాస్టర్స్ ‘అన్బు-అరివు’లు నచ్చలేదని.. అందుకే షూటింగ్ ఆపేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీళ్లు తెరకెక్కించిన యాక్షన్ సీన్‌ను రీషూట్ చేసే ఛాన్స్ ఉందని కూడా భోగట్టా. ఇదే నిజమైతే.. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ కోసం చేసిన ఖర్చు వృధా అనే చెప్పొచ్చు. మేకర్స్ ఇందులో నిజం లేదని చెబుతున్నా.. పుకార్లు మాత్రం ఆగడం లేదు. మరి మరోసారి ఈ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.