Heroine Laya: పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై లయ ఓపెన్ కామెంట్స్
తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Telugu Movie Industry)లో హీరోయిన్ లయ(Laya) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అచ్చతెలుగు బాపు బొమ్మలా తెలుగు ప్రజల మనసు దోచుకుంది. ఆమె కట్టు బొట్టు, నటనకు తెలుగు ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారనడంలో సందేహం లేదు. తక్కువ సినిమాల్లోనే నటించిన లయ(Laya) అందుకు కారణాలను చెబుతూనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power star pawan kalyan) గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది.

పవన్ కళ్యాణ్(pawan kalyan) వ్యక్తిత్వం ఎలాంటిదో లయ(Laya) ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ వివరించింది. 2006లో లయ అమెరికన్ డాక్టర్ అయిన గణేష్ ను పెళ్లి చేసుకుంది. ఆ టైంలో పవన్ కు పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళితే పవన్(Pawan) తనను ఇంటిలోకి పిలిచి చాలా సేపు మాట్లాడారని, పెళ్లికి తప్పకుండా వస్తానని చెప్పినట్లు గుర్తు చేసుకుంది.
తన పెళ్లి సమయంలో చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇద్దరికీ పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించినట్లు లయ(Laya) చెప్పుకొచ్చింది. పెళ్లికి గెస్ట్ గా అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ రావడం తనకు ఆశ్చర్యం వేసినట్లు తెలిపింది. పవన్ చాలా సింపుల్ గా వచ్చారని, ఆయనకు అతిథి మర్యాదలు కూడా చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. అన్నయ్య చిరంజీవిగారు కూడా వస్తున్నారమ్మా..ఆన్ ద వే అంటూ ఆ రోజు పవన్(Pawan) చెప్పిన మాటలు తాను ఇప్పటికీ మర్చిపోలేనని లయ తెలిపింది.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వ్యక్తిత్వంపై లయ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ లయ(Laya) మాటలకు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం లయ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. ఇందులో భాగంగానే లయ(Laya) పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటోంది.