Ram Charan’s RC 15లో కోలీవుడ్ స్టార్ హీరో!?.. నిజమేనా..
Ram Charan : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. అంచనాలు రోజు రోజుకి రెట్టింపవుతున్నాయి. ఇక ఇప్పుడు వినిపిస్తున్న బజ్ వింటే.. ఆర్సీ 15 నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. అంచనాలు రోజు రోజుకి రెట్టింపవుతున్నాయి. ఇక ఇప్పుడు వినిపిస్తున్న బజ్ వింటే.. ఆర్సీ 15 నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్, అంజలి కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే జయరాం, నవీన్ చంద్ర, నాజర్, సముద్రఖని వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.జె.సూర్య ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కూడా ఓ చిన్న పాత్ర పోషిస్తున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. సినిమాలో ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ ఉందట. అది చరణ్ సన్నిహితుడి పాత్ర అని తెలుస్తోంది. ఆ పాత్రలో ఓ స్టార్ హీరో ఉంటే బాగుంటుందని భావిస్తున్నాడట శంకర్. దానికోసం అజిత్‌ను రంగంలోకి దింపుతున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అజిత్ కూడా అందుకు ఓకే చెప్పాడట. అయితే అజిత్‌నే ఎందుకు తీసుకుంటున్నాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటి వరకు అజిత్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు శంకర్. కానీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే అజిత్ సై అన్నాడని టాక్. ఇదే నిజమైతే.. ఆర్సీ 15 క్రేజ్ పీక్స్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడే దీనిపై కన్ఫర్మేషన్ ఇవ్వలేం. అయినా ఈ మధ్య స్టార్ హీరోల గెస్ట్ రోల్స్ కామన్ అయిపోయాయి. కాబట్టి ఈ వార్తలను అంత ఈజీగా కొట్టిపారేయలేం. అయినా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.