మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు గాయాలయ్యాయా? అంటే, ఔననే అంటున్నారు. అసలు చరణ్‌కు గాయాలైనట్టు ఎక్కడా న్యూస్ రాలేదు. దీంతో అసలు చరణ్‌కు ఏమైంది? అని కాస్త కంగారు పడుతున్నారు మెగాభిమానులు.
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జట్‌తో నిర్మిస్తున్నాడు. అయితే ఈ మధ్య గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. కానీ సెడన్‌గా సెప్టెంబర్ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కొందరు నటీనటులు అందుబాటులో లేకపోవడంతో షూటింగ్‌ను వాయిదావేయాల్సివచ్చిందని, అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించింది.
అయితే షూటింగ్ వాయిదాపడటానికి అసలు కారణం వేరే ఉందంటున్నారు. ముందుగా శంకర్ హ్యాండ్ ఇవ్వడం వల్లే షూటింగ్ ఆగిపోయిందని వినిపించింది. కానీ ఇప్పుడు చరణ్‌కు గాయాలయ్యాయనే న్యూస్ వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి దెబ్బతగిలిందట. గేమ్ చేంజర్ షూటింగ్‌లోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయం చిన్నదే అయినా పది రోజుల పాటు రెస్ట్ అవసరమన్నారట డాక్టర్లు.
అందుకే గేమ్‌ఛేంజర్ లేటెస్ట్ షెడ్యూల్‌ను వాయిదా వేశారట. గాయం నుంచి రామ్‌చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆక్టోబర్ 6 నుంచి గేమ్ చేంజర్ నెక్స్ట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్లో ఫైట్ మాస్టర్స్ అన్భు అరివు కంపోజిషన్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేయనున్నారట. అయితే చరణ్‌కి గాయాలు అయ్యాయి అనే విషయం తెలిసి.. మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. కానీ చిన్నదే కాబట్టి.. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు.