Viral: ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా రిలీజ్ డేట్ లాక్..!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ ట్రైనర్ మ్యాడ్. కాలేజ్ డేస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది.
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ నటిస్తున్న సినిమాలో మరో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు. సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఇందులో హీరోలుగా చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాని అక్టోబర్ 6వ తేదీన థియేటర్స్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి టీజర్, పోస్టర్లు విడుదల చేశారు. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాకు హారిక సూర్యదేవర నిర్మాతగా వ్యవహిరించనున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె ఈ హారిక సూర్యదేవర. సితార ఎంటర్టైన్మెంట్స్ సహకారంతో, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌కు చెందిన సాయి సౌజన్య కూడా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ మూవీలో హీరోయిన్లను కూడా చాలా కొత్తవారిని తీసుకున్నారు. గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక అనే ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. షామ్ దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాకి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరి ఈ మూవీ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.