నటుడు రాహుల్ రవీంద్రన్ "చి ల సౌ" సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. ఆ తరువాత నాగార్జున "మన్మధుడు 2" కోసం రాహుల్‌కు అవకాశం ఇచ్చాడు. కానీ అది బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు. ఆ మూవీ ప్రేక్షకుల వద్ద విమర్శలను ఎదుర్కొంది. దీంతో రాహుల్ కెరీర్లో ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు.
రాహుల్ అందించిన ఫిమేల్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ రష్మిక మందన్నను బాగా ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. అధికారిక ప్రకటన పెండింగ్‌లో ఉన్నప్పటికీ, దీనిపై ఎప్పుడో ఒప్పందం పూర్తయ్యింది. వాస్తవానికి ఈ చిత్రం సమంతతో ప్లాన్ చేశారు. రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయితో సమంతకు మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్ కి ఆమె ఒకే చెప్పింది. అయితే అనారోగ్యం, చికిత్స కారణంగా సమంత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ‘బటర్‌ఫ్లై ఫ్లై’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న రష్మిక మందన్న ఇప్పుడు ఈ సినిమాలో భాగం కానుంది. అదే సమయంలో రష్మిక తన తదుపరి రెండు పాన్-ఇండియా చిత్రాలైన యానిమల్, పుష్ప: ది రూల్” పై కూడా పెద్ద ఆశలు పెట్టుకుంది.