GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి 78,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 5 గేట్లు ఎత్తి దిగువకు 79,635 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి కాజా జుబేర్ అహ్మద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318 అడుగులు కాగా, ఇవాళ 317 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు వెల్లడించారు.