TG: హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి కారుపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంచల్గూడ సమీపంలో ఓ యువకుడు జడ్జి కారును అడ్డగించి అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అనుచిత పదజాలంతో జడ్జిని దూషించినట్లు సమాచారం. ఈ ఘటనతో షాక్కు గురైన జడ్జి మాదన్నపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.