SRPT: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహించేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో యువతకు ప్రధానం ఇవ్వాలని, సూర్యాపేట జిల్లా డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మ సతీష్, మునగాల మండల కేంద్రంలో గురువారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలు యువతకు అవకాశం కల్పించాలని కోరారు.