KRNL: ఆదోని మండలం గణేకల్ గ్రామంలో తలపెట్టిన శ్రీ బంగారమ్మ అవ్వ గుడి నిర్మాణం కోరకు స్థానిక టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు విరాళాన్ని ప్రకటించారు. ఆయన ఇవాళ స్వయంగా గణేకల్ గ్రామ పెద్దలను కలిసి గుడి నిర్మాణానికి విరాళం మొత్తం రూ. 51,116 అందించారు. గ్రామంలోని ప్రజలు, పెద్దలు ఆయన అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు.