టీమిండియా అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్‌కు పర్యటనకు హర్షిత్ రాణా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, హర్షిత్ సెలక్షన్‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అశ్విన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హర్షిత్‌ను ఎందుకు సెలక్ట్ చేశారో తెలియడం లేదన్నాడు. అయితే, ఎవరూ అతడిని ట్రోలింగ్ చేయొద్దని సూచించాడు.