HYD: కుత్బుల్లాపూర్ MLAను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సిటీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపును నిరసిస్తూ BRS ఛలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. ఉదయం నిరసన ర్యాలీకి సిద్ధమైన KP వివేకానందను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు.