AP: వైసీపీ రాష్ట్ర కార్యదర్శులుగా ఐదుగురిని నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. వీరు ప్రాంతీయ పార్టీ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గాల పరిశీలకులకు సహాయకులుగా వ్యవహరిస్తారని తెలిపింది. దేశం సుధాకరరెడ్డి (నంద్యాల), మొగసాల రెడ్డప్ప (చిత్తూరు), వీసం రామకృష్ణ (అనకాపల్లి), రాహుల్ రాజారెడ్డి (చిత్తూరు), పృథ్వీరెడ్డి (చిత్తూరు)లను నియమించినట్లు పేర్కొంది.