SKLM కంచిలి డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ మేరకు విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి అందిస్తున్న ఆహారం, వసతి సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలు వివరించగా, వాటిని పరిష్కరించేలా అధికారులకు సూచనలు ఇచ్చారు.