కోనసీమ: అంబాజీపేట గ్రామంలో శ్రీ బేతాళ స్వామి తీర్థ మహోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ.. బేతాళ స్వామి మన నియోజకవర్గ ప్రజలందరిని కాపాడి క్షేమంగా ఉండేలా చూడాలని మనసారా ప్రార్థిస్తున్నానన్నారు. దేవాలయం అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తాను అన్నారు.