ADB: అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న డిగ్రీ విద్యార్థులకు ఈనెల 14 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. B.Sc మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ 4వ సెమిస్టర్ విద్యార్థులకు ఉంటాయన్నారు. ఆదిలాబాద్ అధ్యయన కేంద్రంలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.