KRNL: ఆదోని ఎంపీపీ దానమ్మపై వైసీపీ ఎంపీటీసీలు ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తీర్మానంలో ఆరుగురు సభ్యుల సంతకాలు నకిలీ అని ఆరోపిస్తూ దానమ్మ హైకోర్టులో రెండు రోజుల క్రితం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అధికారులను సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. వైసీపీని వీడి బీజేపీలో చేరిన దానమ్మపై అవిశ్వాస సమావేశం ఈనెల 22న జరగనుండటంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.