TG: RTC బస్సు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనకు BRS పిలుపునిచ్చింది. ఈ క్రమంలో BRS నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై మాజీ మంత్రి KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని RTC ఎండీ కార్యాలయానికి వెళ్లాలనే ప్లాన్ ఉంది. అయితే, ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి హౌస్ అరెస్ట్ చేసింది. ఈ ఉత్సాహం HYDలో నేరాల అదుపు కోసం చూపించాలి’ అని సూచించారు.