MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో గురువారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు క్రాంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా యూత్ అధ్యక్షుడు ఇస్సార్ ఖాన్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఎవరికి ఇచ్చినా, వారి గెలుపు కోసం ప్రతి మండలంలోని యువజన కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.