AP: అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో జగన్ పర్యటనకు వెళ్లేందుకు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సిద్ధమయ్యారు. అయితే, ఆయన్ను వంతాడపల్లి చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కొద్ది సేపు పోలీసులతో వాగ్వివాదంకు దిగారు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకుని విశాఖకు పయనమయ్యారు.