ప్రకాశం: గిద్దలూరులోని దిగువమెట్ట తండాలో పులి సంచారం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. గురువారం సీతా బాయ్ అనే మహిళ తన మేకల దొడ్డిలోకి పులి చొరబడి మేకను నోటకరుచుకుని వెళ్లిందని తెలిపారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయమేస్తుందని స్థానికులు చెబుతున్నారు.అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి తమకు రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు.