MLG: వెంకటాపూర్ మండల MPDOగా గురువారం పొదిలి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యం కారణంగా సెలవులో ఉండటంతో, కలెక్టర్ ఆదేశాలతో మంగపేట పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు . ఈ సందర్భంగా అధికారులు, స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.