ELR: వన్ టౌన్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్న యువతిని ప్రేమించాలంటూ వేధిస్తున్న సాయి అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కళాశాలకు వచ్చి వెళ్లే సమయంలో సాయి వెంటపడటంతో, బాధితురాలు శక్తి టీమ్‌కు ఫిర్యాదు చేసింది. అతడిని పట్టుకున్న శక్తి టీం, వన్డేన్ పోలీసులకు అప్పగించింది. సాయిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.