NTR: కృష్ణలంక పోలీసులు నెహ్రు నగర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు దాడి చేసి, 2,700 కేజీల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఉయ్యూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.