AKP: నర్సీపట్నం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గొలుసు నరసింహమూర్తిలు, వైసీపీ నాయకులు గుడబండి నాగేశ్వరరావు వీరి అనుచరులు గురువారం టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్.రాజు పాల్గొన్నారు.