మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. అయితే, విశాఖ పిచ్ బ్యాటింగ్కు పూర్తి అనుకూలం కాబట్టి మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ స్పిన్నర్లకు కూడా బాగా రాణించే అవకాశముంది. అయితే, ఈరోజు నగరంలో వర్షం పడే సూచనలున్నాయి.