MNCL: దండేపల్లి మండలంలోని బిల్కగూడా గ్రామ గిరిజనులకు జర్నలిస్టులు దుప్పట్లను పంపిణీ చేశారు. దండేపల్లి ప్రెస్‌క్లబ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రెస్‌క్లబ్ సభ్యులు గురువారం ఆ గ్రామానికి వెళ్లి వృద్ధ గిరిజనులకు దుప్పట్లను పంపిణీ చేశారు. శీతాకాలం నేపథ్యంలో సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా వృద్ధ మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశామని జర్నలిస్టులు తెలిపారు.