తాను ఇండస్ట్రీకి వచ్చి 22ఏళ్లు పూర్తయిన సందర్భంగా నటి నయనతార ఎమోషనల్ నోట్ పోస్ట్ షేర్ చేశారు. ‘మొదటిసారి కెమెరా ముందు నిల్చొని 22ఏళ్లు అయింది. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను మార్చేశాయి. నాకు ధైర్యాన్నిచ్చాయి. నన్ను నన్నుగా మలిచాయి. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న ప్రతిఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని తెలిపారు.