TPT: భారతదేశ భవిష్యత్తును రూపొందించటంలో సమర్థవంతమైన పరిపాలన వ్యవస్థ ఎంతో అవసరమని లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. తిరుపతి ఐఐటీలో డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్ సత్యనారాయణ అధ్యక్షతన ‘ఇండియా రోడ్ అహెడ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ.. సామాజిక పరిస్థితిని బట్టి మార్పులు రావాల్సి ఉందన్నారు.