E.G: గోకవరం మండలంలోని కృష్ణుడి పాలెం, గుమ్మల్ల దొడ్డి, అచ్యుతాపురం, రంప ఎర్రంపాలెం గ్రామాలలో ఈ క్రాప్ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే సంక్షేమ పథకాలు అర్హులని కోరుకొండ వ్యవసాయ సహాయ సంచారకురాలు శశి బిందు అన్నారు. ప్రతి ఒక్కరు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గోకవరం ఏవో రాజేశ్వరి కూడా ఉన్నారు.