AP: ప్రజాసమస్యలపై పోరాడే హక్కు తమకుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. తాము కాలేజీలను పరిశీలించడం వెనుక రాజకీయం లేదన్నారు. జగన్ పర్యటనకు కావాలనే ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. ఆంక్షల వల్లే సత్తెనపల్లిలాంటి ఘటనలు జరిగాయాయని అన్నారు. మాజీ సీఎంకు రక్షణ ఇస్తే ఎలాంటి ఘటనలూ జరగవని చెప్పారు.