ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ముంబైలోని రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సహా ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాని స్టార్మర్తో పాటు మొత్తం 125 మంది ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. ఈ చర్చలు ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా జరుగుతున్నాయి.