ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 11న కళాశాలలో రిపోర్టు చేయాలని ప్రిన్సిపల్ విజయభారతి తెలిపారు. వెబ్ ఆప్షన్ పూర్తైన వారికి ఈనెల 10న ఆన్లైన్లో సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు 11న కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలన్నారు. కళాశాలలో రిపోర్టు చేయని విద్యార్థుల సీట్లు రద్దవుతాయన్నారు