VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గురువారం శంకుస్థాపన చేశారు. రూ.కోటి 80 లక్షలతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏడాదిలోపల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.