అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని బ్రహ్మంగారి మఠం ఎదురుగా ఉన్న సందులో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సింగమాల గంగాధర్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓల్డ్ అడ్మిరల్ ఫైన్ VSOP బ్రాందీ 10 సీసాలు, ట్రాపికానా VSOP బ్రాందీ 9 సీసాలు, సుమో 14 సీసాలు సహా మొత్తం 33 మద్యం బాటిల్స్‌ను సీజ్ చేసినట్లు పట్టణ సీఐ నాగార్జున తెలిపారు.