మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 8.5 మి.మీ, జడ్చర్ల 6.5 మి.మీ, నవాబుపేట 3.5 మి.మీ, మిడ్జిల్ 2.8 మి.మీ, కౌకుంట్ల 2.0 మి.మీ, చిన్నచింతకుంట 1.8 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.