ADB: అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు గురువారం తెల్లవారుజామున 2 గంటలకు స్వాధీనం చేసుకున్నారు. బోథ్ మండలంలోని బాజ్జిపేట్ బీట్ పరిధిలోని ఓ రైతు పొలంలో అక్రమంగా నిల్వ ఉన్న టేకు కలపను బీట్ ఆఫీసర్ గెడం సందీప్, బేస్ క్యాంప్ సిబ్బంది గుర్తించారు. టేకు దుంగలను అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.