ఆసిఫాబాద్ జిల్లాలో 2025-27 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల కేటాయింపు కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. కాగజ్ నగర్ డివిజన్లోని 16 దుకాణాల కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉండటంతో ఆశావహులు ముహుర్తాలు, పొత్తులు కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది.