NZB: దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికుల కోసం నిర్వహించిన లక్కీ డ్రా విజేతలను బుధవారం పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ప్రకటించారు. ప్రభుత్వ రవాణా సంస్థ సేవలను వినియోగించుకోవాలని, ఆర్టీసీ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ఈ లక్కీ డ్రాను జిల్లా కేంద్రంలోని రీజినల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తీశారు.