సూర్యాపేట: పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళను చంపుతామని బెదిరించిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖర్ బుధవారం తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న ఎర్కారంకు చెందిన సైదమ్మ ఇంటి ముందు ఉండగా, కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు తల్వార్ తిప్పుతూ ఆమెను బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు