ATP: కుందుర్పి మండల కేంద్రంలోని కుసుమగిరి రైతు సంఘం ఆధ్వర్యంలో అందించే ఉచిత మొక్కలను సద్వినియోగం చేసుకోవాలని కుసుమగిరి రైతు సంఘం నాయకులు గురువారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఎకరాకు 80 మామిడి, 40 సుగాని, 18 ఎర్రచందనం, 5 కొబ్బరి మొక్కలను ఉచితంగా అందిస్తామన్నారు. ఆసక్తి గల రైతులు సంప్రదించాలన్నారు.