HYD: ఆర్టీసీ టికెట్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఛలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ధరల పెంపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా చర్యలు తీసుకున్నారు.