MBNR : జిల్లాలో నేరాల నివారణ, చట్టాలను కాపాడటంలో జిల్లా పోలీసు బలగాలు చూపుతున్న కృషిని జోన్-VII డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ అభినందించారు. పోలీస్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత క్రమశిక్షణతో ప్రజాసేవలో అగ్రగాములు కావాలని ఆకాంక్షించారు.