WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని తిమ్మంపేట గ్రామంలో ఈరోజు BRS గ్రామ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల BRS అధ్యక్షుడు రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఎలక్షన్ల ముందు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.