NTR: తిరువూరు నియోజకవర్గంలో పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, బెల్ట్ షాపుల్లోని మద్యాన్ని పరీక్షించి, కల్తీని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.