SRPT: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన లేఖ ముఖంగా దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి దామన్న చేసిన సేవలను స్మరించుకున్నారు.