NTR: గంపలగూడెం నల్లచెరువు కాలువ వద్ద తూటి కాడ విపరీతంగా పెరగడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు బుధవారం స్వయంగా రంగంలోకి దిగి తూటి కాడ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.