TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ మజ్లీస్పార్టీ మద్దతు ఇస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇదే జరిగితే అధికారపార్టీకి పెద్ద మద్దతు లభించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే గ్రేటర్లో ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.